telugu quran urdu awaz
తెలుగు రోమన్ ఫాంట్ ఖుర్ఆన్, ఉర్దూ రోమన్ ఫాంట్ ఖుర్ఆన్ వివరణ
దుఆ ................
దుఆ ................
సోదరులారా! ఈ రమజాన్ నెలలో ఎక్కువగా దుఆలు చదువుతూ ఉండాలి.
ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో దుఆలు ఎక్కువగా చేస్తూ ఉండాలి.
ఇఫ్తార్ సమయంలో దుఆ స్వీకరించబడుతుంది.
ఇలాంటి మరిన్ని దుఆ ల కోసం ఈ క్రింది బటన్ నొక్కండి
ఖుర్ఆన్ గ్రంధం ఎలా పొందుపరచడం జరిగింది............?
📖📚✍🏻ఖుర్ఆన్ మరియు హదీసులు గ్రంథం రూపంలో ఎలా పొందుపరచబడ్డాయి⁉️
📖ఖుర్ఆన్ గ్రంధం ఎలా పొందుపరచడం జరిగింది.⁉️
📖✍🏻ఖుర్ఆన్ ఎలా భద్రపరచడం జరిగింది. ఖుర్ఆన్ మన వరకు గ్రంధ రూపంలో ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం.
💥 ఈ ఖుర్ఆన్ ని గ్రంధ రూపంలో దాల్చడంలో మూడు కాలాలు పట్టింది. ఒకటి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలము, రెండవది అబూబకర్(రజి) కాలము, మూడవది ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజి) కాలము.
💥దైవప్రవక్త ముహమ్మద్(స) కాలంలో ఖుర్ఆన్ ఏ విధంగా భద్రపరచడం జరిగింది. దాని గురించి ప్రవక్త(స) ఎలాంటి చర్యలు తీసుకున్నారు!?
📖ఈ ఖుర్ఆన్ దైవప్రవక్త ముహమ్మద్(స) పై అవతరింపజేయడం జరిగింది. ఈ ఖుర్ఆన్ గ్రంధాన్ని ఎలాంటి మార్పు, చేర్పులు కాకుండా కాపాడే పూర్తి బాధ్యతను అల్లాహ్ నే తీసుకున్నాడు.
إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. (Quran - 15 : 9)
💥అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేస్తూ ఈ విధంగా అన్నారు;
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ
మేము నిన్ను చదివిస్తాము-మరి నువ్వు దానిని మరువలేవు. (Quran - 87 : 6)
💥మరో చోట అల్లాహ్ ప్రవక్తను ఉద్ధేశించి ఇలా అంటున్నాడు ఈ ఖుర్ఆన్ ను దాన్ని సమకూర్చే, పారాయణం చేయించే బాధ్యత మాది అని. ఈ ఆయతులను చూడండి;
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ
(ఓ ప్రవక్తా!) నీవు ఖుర్‌ఆన్‌ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు.
إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ
దాన్ని సమకూర్చే, (నీచేత) పారాయణం చేయించే బాధ్యత మాది.
فَإِذَا قَرَأْنَٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ
కాబట్టి మేము దానిని పఠించాక, నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ
మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. (సూరా ఖియామహ్ - 75 : 16-19)
➡️పై ఆయతుల వివరణ- దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం దైవవాణి తెచ్చినప్పుడు, దైవప్రవక్త (స) దాన్ని కంఠస్ధం చేసుకోవటానికి వేగిరపడేవారు. ఏ వాక్యాన్నయినా మరచిపోతానేమోనన్న భయంతో ఆయన(స) తొందరపడేవారు. దైవదూత వినిపించే వాక్యలను కంఠస్ధం చేసుకోవటంలో కంగారు పడవద్దని అల్లాహ్ తన ప్రవక్తకు తాకీదు చేశాడు(సహీహ్ బుఖారీ - అల్ ఖియామహ్ సూరా వ్యాఖ్యానం.)
💥ఈ విషయం ఇంతకుముందు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉదా:
وَكَذَٰلِكَ أَنزَلْنَٰهُ قُرْءَانًا عَرَبِيًّۭا وَصَرَّفْنَا فِيهِ مِنَ ٱلْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًۭا
ఇదేవిధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మ చింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము.
فَتَعَٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ ۗ وَلَا تَعْجَلْ بِٱلْقُرْءَانِ مِن قَبْلِ أَن يُقْضَىٰٓ إِلَيْكَ وَحْيُهُۥ ۖ وَقُل رَّبِّ زِدْنِى عِلْمًۭا
కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహ్‌యే సర్వోన్న తుడు. నీ వద్దకు పంపబడే 'వహీ' (దైవవాణి) పూర్తి కానంత వరకూ నువ్వు ఖుర్‌ఆన్ పఠించటంలో తొందరపడకు. అయితే "ప్రభూ! నా జ్ఞానాన్ని పెంచు" అని మాత్రం వేడుకో. (సూర తాహా 20 : 113 - 114)
💥-ఈ ఆదేశం వచ్చిన తరువాత ఆయన (స) దైవవాణి చాలా ప్రశాంతంగా వినేవారు.
➡️దాన్ని సమకూర్చే, (నీచేత) పారాయణం చేయించే బాధ్యత మాది.
📝-అంటే నీ మనోఫలకం పై ఈ ఖుర్ఆన్ సూరాలన్నింటినీ ముద్రించే, ఆపైన నీ నోట దానిని జారిచేయించే బాధ్యత మాది. ఈ ఖుర్ఆన్ లోని ఏ ఒక్క భాగాన్ని కూడా నీవు మరువటంగానీ, మరపింప జేయటంగానీ జరగదు.
💥📖దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన రమదాను మాసంలో హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం కు ఖుర్ఆన్ అప్పజెప్పెవారు:
దివ్య ఖుర్ఆన్ కు రమజాన్ నెలకు అవినాభవ సంబంధం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన ఈ మాసంలోనే హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం కు ఖుర్ఆన్ అప్పజెప్పెవారు. ఆయన(స) మరణించిన ఏడాది వచ్చిన రమజాన్ లో రెండుసార్లు జిబ్రీల్ కు ఖుర్ఆన్ అప్పజెప్పారు.
➡️📚మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది.
💥--అంటే సంక్లిష్టమైన విషయాలను విశదీకరించే, ధర్మాధర్మాలను విడమరచి చెప్పే బాధ్యత కూడా మాదే. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే దైవప్రవక్త (స) దివ్య ఖుర్ఆన్ లోని వివిధ అంశాలకు చెప్పిన తఫ్సీళ్ళే హదీసులు అనబడతాయి. ఈ హదీసులు కూడా దేవుని తరపున ఇవ్వబడిన సంకేతాలే. కాబట్టి హదీసులను కూడా ఖుర్ఆన్ మాదిరిగానే శిరసావహించాలి.
అల్లాహ్ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి ఇలా అనడం జరిగింది:
وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ * إِنْ هُوَ إِلَّا وَحْىٌۭ يُوحَىٰ
అతను (దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటమూ లేదు.
అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.
(Quran - 53 :3- 4)
💥💥📖ఖుర్ఆన్ అంచెలవారిగా అవతరించింది;
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْلَا نُزِّلَ عَلَيْهِ ٱلْقُرْءَانُ جُمْلَةًۭ وَٰحِدَةًۭ ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَٰهُ تَرْتِيلًۭا
"ఇతనిపై ఖుర్‌ఆన్ సాంతం ఒకేసారి ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అవిశ్వాసులు అంటారు. దీనిద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే (కొద్ది కొద్దిగా), అంచెలవారీగా పంపాము.
وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَٰكَ بِٱلْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا
వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్నీ, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము. (సూరా ఫుర్ఖాన్ - 25 : 32-33)
➡️దీనికి సమాధానంగా అల్లాహ్ ఈ ఆయతులో ఇలా అంటున్నాడు: మేము పరిస్ధితులకు, అవసరాలకు అనుగుణంగా ఈ ఖుర్ఆన్ ను గ్రంధాన్ని 23 సంవత్సరాల కాల వ్యవధి కొద్ది కొద్దిగా అవతరింపజేశాము. ఓ ముహమ్మద్ (స)! నీ మనసు కుదుట పడటానికి, నీ శిష్యులు మనస్సులలో దీన్ని గట్టిగా నాటుకునేలా చేయటానికి మేము ఈ ఏర్పాటు చేశాము. ఈ విషయం వేరొకచోట ఇలా అనబడింది:
وَقُرْءَانًۭا فَرَقْنَٰهُ لِتَقْرَأَهُۥ عَلَى ٱلنَّاسِ عَلَىٰ مُكْثٍۢ وَنَزَّلْنَٰهُ تَنزِيلًۭا
నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్‌ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరిం పజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము. (సూరా ఇస్రా - 17 : 106)
💥-ఈ ఖుర్ఆన్ ఆకాశం నుంచి కురిసే వానజల్లు వంటిది. వర్షం కురిసినప్పుడల్లా మృతభూమిలో ప్రాణం వస్తుంది. బీటలు వారి ఉన్న నేల ఒక్కసారిగా ఉబుకుతుంది, పులకిస్తుంది. అయితే వర్షం ఒకేసారి కుండపోతగా పడి ఆగిపోవటం కన్నా ఆగి ఆగి తెరలు తెరలుగా వస్తూ ఉంటే అది ఎంతో ప్రయోజన దాయకం అవుతుంది. అందుకే దివ్యఖుర్ఆన్ కూడా 23సంవత్సరాల వ్యవధిలో పరిస్ధితుల స్వరూపానికనుగుణంగా అవతరించి విశ్వాసుల మనోభూమిని సస్యశ్యామలం చేసింది.
💥-దివ్య ఖుర్ఆన్ అంచెలంచెలుగా - అవసరాల కనుగుణంగా - అవతరింపజేయబడటంలోని ఇంకొక మర్మం ఇక్కడ తెలియజేయబడింది. అవిశ్వాసులు, ముష్రిక్కులు ఎప్పుడు ఏ తిరకాసు ప్రశ్నలు వేసినా, ఎప్పుడూ పిడివాదానికి దిగినా వారికి దీటైన జవాబు ఇవ్వటానికి దేవుడు తన వచనాలను పంపేవాడు.
📖✍🏻దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సహచరుల బృందం నుంచి విశ్వసనీయమైన మరియు పరిజ్ఞానం ఉన్నవారిని ఖుర్ఆన్ వ్రాయుటకు నియమించారు
💡అందులో ఉన్నవారు: 'అబ్దుల్లాహ్ ఇబ్న్' అమర్ ఇబ్నుల్-ఆస్, ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్, జైద్ ఇబ్న్ సాబిత్ మరియు ఇతరులను నియమించారు.
💥ఖుర్ఆన్ జ్ఞాపకం చేసుకున్న సహబా యొక్క హృదయాలలో మరియు జంతువుల చర్మాలు మరియు ఇతర వస్తువులపై ఉండిపోయింది ఖలీఫా అబూ బకర్ అస్సిద్దీక్ (రదియల్లాహు అన్ హు) వారి కాలం వరకు భద్రపరచబడింది.
💥రిద్దా యుద్ధాల సమయంలో ఖుర్ఆన్ కంఠస్థం చేసిన సహబా చాలా మంది చంపబడ్డారు. మరియు అబూ బకర్ (రదియల్లాహు అన్ హు) వారు ఖుర్ఆన్ పోతుందని భయపడ్డారు.
💥అందువల్ల ఆయన ఖుర్ఆన్ ను ఒకే పుస్తకంలో సంకలనం చేయడం గురించి గరిష్ఠ సహబాను సంప్రదించారు తద్వారా ఇది కోల్పోకుండా సంరక్షించబడి ఉంటుంది
💥ఆయన ఈ మిషన్‌ను ఉత్తమమైన జ్ఞాపక శక్తి పొందిన జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్ హు) వారిని అప్పగించారు
📚ఇమామ్ అల్-బుఖారీ వారు తన సహీహ్ (4986) లో జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం ఈ విధంగా వివరించారు:
🛡️"అల్-యమామా (యుగంలో) ప్రజలు [అనగా, తప్పుడు ప్రవక్త ముసాయిలిమాకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ప్రవక్త సహచరులు] చంపబడినప్పుడు అబూ బకర్ అస్-సిద్దీక్ వారు నాకు పిలుపు పంపారు. (నేను ఆయన దగ్గరకు వెళ్ళాను) అక్కడ ‘ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ ఆయనతో కూర్చొని ఉన్నారు
💥అబూ బకర్ వారు అప్పుడు (నాతో ఇలా అన్నారు), "ఉమర్ వారు నా వద్దకు వచ్చి ఇలా అంటున్నారు: ఖుర్ఆన్ యొక్క ఖుర్రాలో (అంటే ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారు) యుద్ధం రోజున మరణించారు. అల్-యమామా మరియు ఇతర యుద్ధభూమిలలో ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారిలో మరింత భారీ ప్రాణనష్టం జరగవచ్చని నేను భయపడుతున్నాను, తద్వారా ఖుర్ఆన్ యొక్క ఎక్కువ భాగం కోల్పోవచ్చు. అందువల్ల మీరు (అబూ బకర్) ఖుర్ఆన్ సేకరించడానికి ఆదేశించాలని నేను సూచిస్తున్నాను"
నేను 'ఉమర్ వారితో (ఇలా అన్నాను) "ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చేయని పనిని మేము ఎలా చేయగలము?" 'అల్లాహ్ ప్రమాణం ఇది మంచి కార్యం "అని ఉమర్ అన్నారు. అల్లాహ్ నా హృదయాన్ని తెరిచే వరకు ఉమర్ వారు తమ ప్రతిపాదనను అంగీకరించమని నన్ను కోరుతూనే ఉన్నారు మరియు ఉమర్ వారు గ్రహించిన ఆలోచనలోని మంచిని నేను గ్రహించగలిగాను"
🤝🏻అప్పుడు అబూ బకర్ వారు (జైద్ బిన్ సాబిత్ తో) అన్నారు. "మీరు తెలివైన యువకులు మరియు మీ గురించి మాకు ఎటువంటి సందేహం లేదు, మరియు మీరు ప్రవక్త వారి కోసం దైవ ప్రేరణను వ్రాసేవారు కాబట్టి ఖుర్ఆన్ (విచ్ఛిన్నమైన భాగాల) కోసం శోధించండి మరియు దానిని ఒకే పుస్తకంలో సంకలనం చేయండి"
అల్లాహ్ ప్రమాణం వారు నన్ను ఒక పర్వతాన్ని తరలించమని ఆదేశించినట్లయితే, ఖుర్ఆన్ సంకలనం చేయమని నన్ను ఆదేశించడం కంటే ఇది నాకు భారీగా ఉండేది కాదు.
-అప్పుడు నేను (అబూబకర్ వారితో ఇలా అన్నాను), "ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చేయని పనిని మీరు ఎలా చేయగలరు?" అబూ బకర్ వారు "అల్లాహ్ ప్రమాణం, ఇది మంచి కార్యం" అని సమాధానం ఇచ్చారు. అబూ బకర్ మరియు ఉమర్ వారి హృదయాలను తెరిచిన దానికి అల్లాహ్ నా హృదయాన్ని తెరిచే వరకు తమ సలహాను అంగీకరించమని అబూ బకర్ వారు నన్ను కోరుతూనే ఉన్నారు"
✒️"కాబట్టి నేను ఖుర్ఆన్ (వ్రాయబడిన) తాటి కాండాలు, సన్నని తెల్లటి రాళ్ళు మరియు కంఠస్థం చేసిన పురుషుల నుండి సేకరించడం మొదలుపెట్టాను సూరత్ అత్-తౌబా యొక్క చివరి ఆయత్ దొరికినంత వరకు సేకరించాను ఖుజైమా అల్-అన్సారీ వారి తప్ప మరెవరితోనూ (ఈ చివరి ఆయత్) కనుగొనలేదు"
📖ఖుర్ఆన్ యొక్క పూర్తి రాతప్రతి (కాపీ) ఆయన చనిపోయే వరకు అబూ బకర్ వారి వద్ద, తరువాత 'ఉమర్ వారు తమ జీవితాంతం వరకు, ఆపై' ఉమర్ వారి కుమార్తె హఫ్సా దగ్గర ఉన్నింది.
💥💥💥
💥📖📚✍🏻✍🏻పై హదీసుల ఆధారంగా ఖుర్ఆన్ చాల జాగ్రత్తగా, బలంగా పొందుపరచబడ్డాయని తెలుస్తుంది. అలాగే హదీసులు కూడా గుర్తుపెట్టుకొనేవారు మరియు రాసేవారని కూడా హదీసులలో చెప్పబడింది
x

Subscribe to:
Posts (Atom)