![]() |
సలాతు త్తస్బీహ్ ఎలా చదవాలి?
ఇది ఒక స్వంత ఆరాధన, దీని పద్ధతి ఇలా ఉంది:
నాలుగు రకాత్ లు సలాతు త్తస్బీహ్ చదువుతున్నాను అని నియ్యత్ చెయ్యండి.
సూర ఎ ఫాతిహా కు ముందు మూడవ కలిమ సుబ్హానల్లాహి వల్ హమ్దులిల్లాహి వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వరకు 15 సార్లు చదవండి.
సూర ఎ ఫాతిహా మరియు జమ్ సూరహ్ తరువాత 10 సార్లు చదవండి.
రుకూ తస్బీహ్ తరువాత 10 సార్లు చదవండి.
రుకూ తరువాత లేచి 10 సార్లు చదవండి.
సజ్ద తస్బీహ్ తరువాత 10 సార్లు చదవండి.
సజ్ద నుండి లేచి జల్సా లో10 సార్లు చదవండి.
రెండవ సజ్ద లో 10 సార్లు చదవండి
ఇలా ప్రతి రకాతు లో 75 సార్లు చదవాలి
మొత్తము 300 సార్లు చదవాలి
నాలుగు రకాతు లలో, మొత్తము 300 సార్లు చదవాలి, మరియు అత్తహియ్యాత్ రెండు సార్లు పూర్తి చేయాలి.
(తిర్మిజీ,ఇబ్నెమాజ, అబూ దావూద్)
Read Online Below













