రోజా నెంబర్ 29&30:- దుఆ 29&30 :- ఇఫ్తార్ సమయములో ఈ దుఆ చదవండి













సోదరులారా! ఈ రమజాన్ నెలలో

ఎక్కువగా దుఆలు చదువుతూ ఉండాలి.

ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో దుఆలు

ఎక్కువగా చేస్తూ ఉండాలి. 


ఉపవాస విరమణ (ఇఫ్తార్) సమయంలో దుఆ స్వీకరించబడుతుంది. (ముస్లిం)


ఖుర్ఆన్ నుండి కొన్ని దుఆలు.


40 రబ్బనా దుఆ లు


అల్లాహ్ (సు. తఆలా) ఖుర్ఆన్ గ్రంధంలో  ఆయనను ఎలా ప్రార్ధించాలో, ఎలా వేడుకోవాలో, ఎలా అడగాలో తెలియజేసే అనేక ప్రార్ధనా విధానాలను నేర్పించాడు. ముఖ్యంగా రబ్బనా అంటూ ప్రారంభమయ్యే సుమారు 40 దుఆలు ఉన్నాయి. వాటిని మీకొరకు ఒకచోటికి చేర్చాము. ఇందులో అరబీచదవటం రాని తెలుగు వారికి ఈ దుఆలను తెలుగులో అరబీ మాటలు చదువుకొనే వీలుగా వ్రాయటం జరిగింది. దానికి అర్ధం కూడా తెలుగు భాషలోవ్రాశాము కనుక  మీరు అవసరాన్ని బట్టి ఏ దుఆ చదువుకోవాలో సులభంగా గ్రహించగలరు. ఆఈ దుఆలు చదువుకుంటూ అల్లాహ్ ను స్మరిస్తూ,  ప్రార్ధిస్తూ,ఆయన ఆశీర్వాదానుగ్రహాలు పొందగలరని ఆశిస్తున్నాము.  


40 రబ్బనా దుఆ లు


1.ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ

వినేవాడవు సర్వం తెలిసినవాడవు .

రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీ ఉల్ అలీం [2:127]

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ


2.ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి.

మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారు చెయ్యి,

మాకు నిన్ను ఆరాధించే పద్దతులను నేర్పు,

మా పశ్చాతాపాన్ని అంగీకరించు,

నిస్సందేహంగా నీవు పశ్చాతాపాన్ని

అంగీకరించే వాడవు. దయామయుడవు. [2:128]


రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అర్నా మనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ


3.ఓ ప్రభూ ! ఇహలోకం లోనూ మరియు

పరలోకం లోనూ మంచిని ప్రసాదించి,

నరక శిక్షల నుండి కాపాడుము

[2:201]

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖి రతి హసనతన్ వఖినా ‘అదాబన్నార్

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ


4.ఓ ప్రభూ ! శత్రువులని ఎదుర్కొనునపుడు

సహనము ,స్థిరత్వము నొసంగి

శత్రువులపై విజయమును నొసంగుము.[2:250]

రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రన్ వ తబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

[البقرة :250]


5.ఓ ప్రభూ ! మేము మరచినను

లేక పొరపాటు పడినను

మమ్ము పట్టకుము .[2:286]

రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా

رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا

[البقرة :286]


6.ఓ మా ప్రభువా ! మాకు ముందు గడచిన వారిపై

నీవు మోపినట్టి భారమును మాపై మోపకుము

[2:286]

రబ్బనా వలా త హ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా

رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا

[البقرة :286]


7.ఓ మా ప్రభూ ! సహింప లేని భారమును

మాపై నుంచకుము .

మమ్ము వదిలి పెట్టుము .

మమ్ము క్షమింపుము .

మమ్ము కరుణించుము .

నీవే మాకు సహాయుడువు .

కావున నీవు అవిశ్వాసులకు

విరుద్ధముగా మాకు సహాయము చేయుము

[2:286]

రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

[البقرة :286]


8.ఓ ప్రభూ ! నీవు మాకు

సన్మార్గము చూపిన పిదప

మా హృదయములను తప్పు త్రోవలకు

పోనియ్యకుము .

నీ దయను మా పై ఉంచుము .

నీవే సర్వము నొసంగువాడవు.

[3:8]

రబ్బనా లాతుజిగ్ ఖులూబనా బనా బ అద ఇజ్ హదైత నా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మ తన ఇన్నక అన్ తల్ వహ్హాబ్

رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ

[8: آل عمران]


9.ఓ మా ప్రభూ ! నీవు సర్వ జనులను

ఒక దినము చేర్తువు .

ఆ దినము గూర్చి ఎట్టి సందేహము లేదు .

నిశ్చయముగా అల్లా : ఎప్పటికిని

తానిచ్చిన మాటకు వ్యతిరేకము చేయడు. [3:9]

రబ్బనా ఇన్నక జామి ఉన్నాసి లియౌమిల్ లారైబ ఫీహి ఇన్న ల్లాహ లా యుఖ్ లిఫుల్ మిఆద్

رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لاَّ رَيْبَ فِيهِ إِنَّ اللّهَ لاَ يُخْلِفُ الْمِيعَادَ

[آل عمران :9]


10.ఓ మా ప్రభూ ! మేము విశ్వ సించాము,

కనుక మా పాపాలను మన్నించు

ఇంకా మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.

[3:16]

రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ ఖిన్నా ‘అధాబన్నార్

رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ


11.ఓ మా ప్రభూ !

నీవు పంపిన దానిని విశ్వసించితిమి .

ప్రవక్తకు విధేయులైతిమి .


కావున విశ్వసించిన సాక్షులలో

మమ్ము వ్రాసికొనుము

[3:53]

రబ్బనా ఆమన్నా బిమా అన్ జల వత్ తబ అ నర్ రసూల ఫక్ తుబ్నా మ అష్ షాహిదీన్

رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلَتْ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ

[آل عمران :53]


12.ఓ మా ప్రభూ ! మా పాపములను ,

మా కార్యములలో ,

మేము మితిమీరి పోయిన

దానిని క్షమించుము .

మా పాదములను స్థిరముగా ఉంచుము .

అవిశ్వాసులను జయించుటకు

మాకు సహాయపడుము

[3:147]

రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينََِ

[آل عمران :147]

13. మా ప్రభూ!

నువ్వు ఈ సృష్టిని

నిరర్థకంగా చేయలేదు

నువ్వు పవిత్రుడవు .

మమ్మల్నినరకాగ్ని శిక్ష నుంచి కాపాడు

[3:191]


13. రబ్బనా మా ఖలక్ తా హాజా బాతిలన్ సుబహానక ఫఖినా అజాబన్నార్

رَبَّنَا مَا خَلَقْتَ هَذا بَاطِلاً سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ

[آل عمران :191]


14. ఓ మా ప్రభూ!

నువ్వెవరినైతే నరకాగ్నిలో

పడవేస్తావో,

వాణ్ణి నువ్వుపరాభవానికి ,

అవమానానికి గురి చేసినట్లే

యదార్థానికి తోడ్పడేవారెవరూ ఉండరు.


రబ్బనా ఇన్నక మన్ తుద్ ఖిలన్నార ఫఖద్ అఖజైతహు వమా లిద్దాలిమినా మిన్ అన్సార్

رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

[آل عمران :192]


15. రబ్బనా ఇన్ననా సమ్యినా మునాదియ్య యునాది లిల్ ఈమాని అన్ అమిను బి రబ్బకుమ్ ఫ అమన్నా

رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلإِيمَانِ أَنْ آمِنُواْ بِرَبِّكُمْ فَآمَنَّا

[آل عمران :193]

ఓ మా ప్రభూ!

పిలిచేవాడొకడు విశ్వాసం

(ఈమాన్)వైపుకు పిలవటం ,

ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి

అని పిలుపు నివ్వటం మేము విన్నాము

అంతే మేము విశ్వసించాము.

[3:193]

16. رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الأبْرَارِ

[آل عمران :193]


16. రబ్బనగ్ ఫిర్ లనా జునుబనా వ కఫ్ఫిర్ అన్నా సయ్యిఆతినా వతవఫ్ఫనా మా అల్ అబ్ రార్


ఓ ప్రభూ!

మా పాపాలను క్షమించు

మా చెడుగులను

మా నుంచి దూరం చెయ్యి

సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు

[3:193]


17. రబ్బనా వ ఆత్తినా మా వ అద్ త్తనా అలా రుసులిక వలా తుఖ్జినా యౌమల్ ఖియామా ఇన్నక లా తుఖ్ లిఫుల్ మిఆద్

رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَى رُسُلِكَ وَلاَ تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لاَ تُخْلِفُ الْمِيعَاد

[آل عمران :194]


18. ఓ మా ప్రభూ!

నీ ప్రవక్తల ద్వారా

నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం

మమ్మల్ని అనుగ్రహించు

ప్రళయ దినాన మమ్మల్ని

అవమానపరచకు

ఎట్టి పరిస్థతిలోనూ

నీవు వాగ్దానానికి విరుద్దంగా

వ్యవహరించే వాడవు కావు

[3:194]


18. رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ

[المائدة :83]


మా ప్రభూ!

మేము విశ్వసించాము

కాబట్టి మా పేర్లను కూడా

ధృవీకరించే వారితో పాటు వ్రాసుకో. [5:83]


రబ్బనా ఆమన్నా ఫక్ తుబ్ నా మా అష్ షాహిదీన్

19. رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَاء تَكُونُ لَنَا عِيداً لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ

[المائدة :114]


ఓ మా ప్రభూ!

ఆకాశం నుంచి మా పై

ఆహారంతో నిండిన పళ్ళాన్ని దించు

దాన్ని మా కొరకు

అనగా మా లోని తొలివారు ,

తుదివారందరికీ సంతోషకరమైన

విషయం కావాలి

ఇంకా నీ తరుపున అది

ఒక సూచన కాగలగాలి .

నీవు మాకు ఆహారం ప్రసాదించు .

నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు. [5:114]


రబ్బనా అన్ జిల్ అలైనా మాయిదతమ్ మినస్సమాయి తుకూనులనా ఇదల్ లి అవ్ లినా వ అఖిర్ నా వ ఆయాతమ్ మిన్ కా వర్ జుఖ్ నా వ అన్ తా ఖైరుల్ రాజిఖిన్

20. رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

[الأعراف :23]


మా ప్రభూ

మేము స్వయానికి

ఎంతో ఆన్యాయం చేసుకున్నాము

ఇప్పుడు నీవు గనక

మాకు క్షమా భిక్ష పెట్టి

మా పై దయ తలచకపోతే

నిశ్చయంగా నష్టపోతాము . [7:23]


రబ్బనా జలమ్ నా అన్ ఫుసినా వఇల్లమ్ తగ్ ఫిర్ లనా వతరహమ్ నా లనా కూనన్నా మినల్ ఖాసిరీన్

21. رَبَّنَا لاَ تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ

[الأعراف :47]


ఓ ప్రభూ మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు [7:47]


రబ్బనా లా తజ్అల్ నా మాఆల్ ఖౌమి జ్జాలిమిన్

22. رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَأَنتَ خَيْرُ الْفَاتِحِينَ

[الأعراف :89]


ఓ ప్రభూ

మాకూ మా జాతి వారికి మధ్య

న్యాయంగా తీర్పు చెయ్యి

నీవు అందరికన్నా ఉత్తమంగా

తీర్పుచేసేవాడవు . [7:89]


రబ్బనా ఇఫ్ తహ్ బైననా వ బైనా ఖౌమినా బిల్ హఖ్ఖి వ అన్ తా ఖైరుల్ ఫాతిహిన్

23. رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَتَوَفَّنَا مُسْلِمِينَ

[الأعراف :126]


ఓ మా ప్రభూ

మా పై సహనాన్ని కురిపించు

నీకు విధేయులు గా ఉన్న స్థితిలోనే

మరణాన్ని వొసగు! [7:126]


రబ్బనా అఫ్ రిగ్ అలైనా సబ్ రవ్వ వతా వఫ్ఫానా ముస్లిమీన్

24. رَبَّنَا لاَ تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ ; وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ

[يونس :85-86]


మా ప్రభూ

మమ్మల్ని ఈ దుర్మార్గుల

పరీక్షా సాధనంగా చేయకు.

నీ కృపతో మమ్మల్ని

ఈ అవిశ్వాసుల చెరనుండి కాపాడు

అని వేడుకున్నారు

[10:85-86]

రబ్బనా లా తజ్ఆల్ నా ఫిత్ నల్ లిల్ ఖౌమి జ్జాలిమీన్ వనజ్జానా బి రహ్మతికా మినల్ ఖౌమిల్ కాఫిరీన్

25. رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ وَمَا يَخْفَى عَلَى اللّهِ مِن شَيْءٍ فَي الأَرْضِ وَلاَ فِي السَّمَاء

[إبرهيم :38]


ఓ మా ప్రభూ

మేము దాస్తున్నదీ

బహిర్గతం చేస్తున్నది

అంతా నీకు తెలుసు

భూమిలోగాని ఆకాశాలలోగాని

ఏ వస్తూవూ అల్లాహ్ నుండి దాగి లేదు. [14:38]


రబ్బనా ఇన్నక తాలము మా నుక్ ఫి వమా నుఆల్లిను వమా యక్ ఫా ఆలా ల్లాహి మిన్ షయ్యిన్ ఫిల్ ఆర్ ది వలా ఫిస్సమా

26. رَبَّنَا وَتَقَبَّلْ دُعَاء

[إبرهيم :40]


ప్రభూ నా ప్రార్థనను ఆమోదించు. [14:40]

రబ్బనా వ తఖబ్బల్ దుఆ

27. رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ

[إبرهيم :41]


మా ప్రభూ నన్ను

నా తల్లిదండ్రులను విశ్వాసులను

లెక్క తేల్చే రోజున క్షమించు!


[14:41]


రబ్బనా ఇగ్ఫిర్ లి వలి వాలిదయ్యవలిల్ మూమినీనా యౌమ యకూముల్ హిసాబ్

28. رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا

[الكهف :10]


మా ప్రభూ

నీ వద్ద నుంచి

మాకు కారుణ్యాన్ని ప్రసాదించు

మా పనిలో మా కోసం సన్మార్గాన్ని

సులభతరం చేయ్యి ! [18:10]


రబ్బనా ఆతినా మిల్లదున్క రహ్మతవ్వో వహయ్యిలనా మిన్ ఆమ్రినా రషాదా

29. رَبَّنَا إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَا أَوْ أَن يَطْغَى

[طه :45]


ప్రభూ వాడు మా పై దౌర్జన్యానికి

పాల్పడతాడేమోననీ

లేదా హద్దు మీరి పోతాడేమోనని

మాకు భయంగా ఉంది. [20: 45]


రబ్బనా ఇన్ననా నఖాఫు అయ్య్ యఫ్ రుత్ అలైనా అవ్ అయ్య్ యత్ గా

30. رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ

[المؤمنون :109]


మా ప్రభూ మేము విశ్వసించాము .

కనుక మమ్మల్ని క్షమించు ,

మా పై దయజూపు నువ్వు

దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు

అని వేడుకునే వారు [23: 109]


రబ్బనా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా వర్ హమ్ నా వఆన్ తా ఖైరుర్ రాహిమిన్

31. رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا إِنَّهَا سَاءتْ مُسْتَقَرًّا وَمُقَامًا

[الفرقان :65-66]


మా ప్రభు

మా పై నుంచి నరక శిక్షను తొలగించు .

ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికి వీడనిది

ని శ్చయంగా అది చాలా

చెడ్డచోటు చెడ్డ నివాస స్ధలం .

[25: 65-66]

రబ్బనా ఇస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమా ఇన్నా అజాబహా కానా గరామా ఇన్నహ సఆత్ ముస్ తఖర్వో వ ముఖామా

32. رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا

[الفرقان :74]


ఓ మా ప్రభూ

నువ్వు మా భార్యల ద్వారా ,

మా సంతానం ద్వారా

మా కళ్ళకు చలువను ప్రసాదించు.

మమ్మల్ని దైవ భక్తి పరుల నాయకుని గా చేయి.

[25:74]

రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వజుర్రియాతినా ఖుర్రతా ఆయుని వజ్ ఆల్ నా లిల్ ముఖ్తఖినా ఇమామా

33. رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ

[فاطر :34]


మా ప్రభువు అమితంగా క్షమించేవాడు ,

సత్కార స్వభావుడు

[35: 34]

రబ్బనా లా గఫూరున్ షకూర్

34. آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ

[غافر :7]


మా ప్రభూ

నీవు ప్రతి వస్తువును

నీ దయానుగ్రహం తో ,

పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు

కనుక పశ్చాత్తాపం చెంది ,

నీ మార్గాన్ని అనుసరించిన

వారిని నీవు క్షమించు

ఇంకా వారిని నరక శిక్ష

నుంచి కూడా కాపాడు!

[40:7]

రబ్బనా వాసిఆత కుల్ల షయ్యిర్ రహ్మతవ్వో వ ఇల్మన్ ఫగ్ ఫర్ లి లిల్లాజీనా తాబు వత్తబవూ సబీలకా వఖిహిమ్ అజావల్ జహిమ్

35. رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُم وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ وَقِهِمُ السَّيِّئَاتِ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ وَذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ

[غافر :8-9]


మా ప్రభూ

నువ్వు వారికి వాగ్ధానం

చేసి వున్న శాశ్వితమైన స్వర్గవనాలలో

వారికి ప్రవేశం కల్పించు

మరి వారి పితామహులలోని ,

సతిమణులలోని సంతానంలోని సజ్జనులకు

కూడా నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి,

వివేక సంపన్నుడివి .

వారిని చెడుల నుండి కూడా కాపాడు

యదార్థమేమిటంటే ఆనాడు

నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై

నీవు (అమితంగా ) దయ జూపినట్లే .

గొప్ప సాఫల్యం అంటే అదే.

[40:8-9]

రబ్బనా వద్ ఖిల్ హుమ్ జన్నాతి అద్ ని నిల్లతి వఅద్త్ హుమ్ వమన్ సలహ మిన్ ఆబాఇహిమ్ వఅజ్వాజిహిమ్ వ జుర్రియాతిహిమ్ ఇన్నక అన్ తా అజీజుల్ హకీమ్ వఖిహిముస్ సయ్యఆతి వ మన్ తఖిస్ సయ్యిఆతి యౌమఇజిన్ ఫఖద్ రహిమతహు వ జాలిక హువల్ ఫౌజుల్ ఆజీమ్

36. رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا

[الحشر :10]


మా ప్రభూమ మ్మల్ని క్షమించు

మా కన్నా ముందు విశ్వసించిన

మా సోదరులను కూడా క్షమించు

విశ్వాసుల యెడల మా హృదయాలలో

ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు .

[59:10]

రబ్బన గ్ ఫిర్లనా వలి ఇఖ్వానీనల్లజీనా సబఖూన బిల్ ఈమాని వలా తజ్ ఆల్ ఫి ఖులుబినా గిల్లజినా ఆమను

37. رَبَّنَا إِنَّكَ رَؤُوفٌ رَّحِيمٌ

[الحشر :10]


మా ప్రభూ నిశ్చయంగా

నీవు మృదు స్వభావం కలిగిన వాడవు

కనికరించేవాడవు.

[59:10]

రబ్బనా ఇన్నక రవూఫుర్ర్ రహిమ్

38. رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ

[الممتحنة :4]


మా ప్రభూ

మేము నిన్నే నమ్ము కున్నాము

నీ వైపునకే మరలుతున్నాము

నిన్నే చేరుకోవలసి ఉంది

[60:4]

రబ్బనా అలైక తవక్కల్ నా వ ఇలైక అనబ్ నా వ ఇలైకల్ మసీర్

39. رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ

[الممتحنة :5]


మా ప్రభూ

అవిశ్వాసు లకొరకు మమ్మల్ని

పరీక్షా సాధనంగా చేయకు

ప్రభూ మా తప్పులను క్షమించు

నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు

వివేకవంతుడవు

[60:5]

రబ్బనా లా తజ్ అల్ నా ఫత్ నతల్ లిల్లాజీనా కఫరూ వగ్ ఫిర్ లనా రబ్బనా ఇన్నక అన్ తల్ అజీజుల్ హకీమ్

40. رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

[التحريم :8]


మా ప్రభూ

మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు

మమ్మల్ని క్షమించు నిశ్ఛయంగా

నీవు అన్నింటి పై ఆధికారం కలవాడవు.

[66:8]

రబ్బనా అత్ మిమ్ లనా నూరనా వ ఇగ్ ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.


❄❄❄❄❄❄❄❄❄❄❄




7 comments: